చంద్రుడి నుంచి భూమిపై పడిన ఆ రాయి విలువెంతో తెలుసా?

Sun,October 21, 2018 01:49 PM

The Moon Puzzle auctioned for over 4 crore rupees reveals RR Auction New York

న్యూయార్క్: ద మూన్ పజిల్‌గా పేరుగాంచిన ఓ రాయిని అమెరికాకు చెందిన ఆర్‌ఆర్ ఆక్షన్ సంస్థ వేలం వేసింది. ఇది ఏకంగా 612500 డాలర్లు (సుమారు రూ.4.5 కోట్లు) పలకడం విశేషం. దీని అధికారిక పేరు ఎన్‌డబ్ల్యూఏ 11789. అనధికారికంగా ద మూన్ పజిల్, బువాగబాగా పిలుస్తున్నారు. ఇది గతేడాది భూమిపై కనిపించింది. చంద్రుని ఉపరితలంపై ఓ ఉల్క పడటం వల్ల జరిగిన పేలుడుతో ఇది భూమిపైకి వచ్చి పడింది. సుమారు రెండున్నర లక్షల మైళ్ల దూరం ప్రయాణించడంతోపాటు భూ వాతావరణ పరిస్థితులన్నింటినీ తట్టుకొని నిలిచిందీ రాయి.

వాయవ్య ఆఫ్రికాలోని ఎడారిలో ఈ రాయి కనిపించింది. దీని బరువు 5.5 కిలోలుగా ఉంది. ఆరు చిన్న చిన్న శకలాలుగా ఉన్న ఈ రాయిని కలిపితే ఓ పజిల్‌లా కనిపించడంతో దీనికి ద మూన్ పజిల్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యంత అరుదైన, ముఖ్యమైన గ్రహ శకలాల్లో ఇదీ ఒకటని ఆర్‌ఆర్ ఆక్షన్ సంస్థ వెల్లడించింది. వియత్నాంలోని హా నామ్ ప్రావిన్స్‌కు చెందిన టామ్ చుక్ పగోడా కాంప్లెక్స్ ప్రతినిధి ఈ భారీ మొత్తం చెల్లించి లూనార్ పజిల్‌ను సొంతం చేసుకున్నారు. దీనిని తమ మ్యూజియంలో పెట్టబోతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

12409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles