అమ్మతనానికి అద్దం పట్టే ఫోటోలుWed,October 11, 2017 05:17 PM
అమ్మతనానికి అద్దం పట్టే ఫోటోలు

అమ్మ.. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రత్యక్ష దైవం తల్లి అంటారు. కన్న బిడ్డ సంతోషం కోసం తన సుఖాల్ని, సంతోషాల్ని త్యాగం చేస్తుంది తల్లి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తల్లి లేనిదే ఈ ప్రపంచమే లేదు. అంత ప్రాముఖ్యమున్న తల్లిలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలనుకుంది ఫోటోగ్రాఫర్ ఇవెట్టే ఇవెన్స్.

చాలా మంది తల్లులు పబ్లిక్‌గా పిల్లలకు పాలు ఇవ్వడానికి కొంచెం జంకుతారు. ఎందుకంటే.. పబ్లిక్‌గా పాలు ఇచ్చేటప్పుడు తల్లులకు ఎన్నో సమస్యలు వస్తాయి. కొంతమంది కామెంట్ చేస్తారు.. ఎగతాళి చేస్తారు..కొన్ని ప్రాంతాల్లో అనుమతించరు.. పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు కొన్ని చేదు సంఘటనలు కూడా ఇదివరకు తల్లులకు ఎదురయ్యాయి. అయితే.. పబ్లిక్‌లో ఇటువంటి ధోరణి మారాలని... ఆ ఫోటోగ్రాఫర్.. తమ పిల్లలకు పాలు ఇస్తున్న తల్లులను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 80 శాతం శరీరం కాలిన మిమి అనే 27 ఏళ్ల మహిళ తన బిడ్డకు పాలు ఇస్తున్న ఫోటో ఇవెట్టే ఇవెన్స్ కు చాలా స్పూర్తినిచ్చిందట. ఇక.. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవడమే కాదు.. నెటిజన్లు కూడా ఈ ఫోటోలకు మద్దతు పలుకుతూ తల్లులకు వందనాలు చేస్తున్నారు.5115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS