వీర్య క‌ణాల స్మ‌గ్లింగ్

Fri,April 21, 2017 05:20 PM

Thai man arrested for allegedly smuggling human semen

బ్యాంకాక్: ఎప్ప‌టిలాగే ఈ సారి కూడా అత‌ను ఓ పెద్ద బ్యాగ్ వేసుకుని బోర్డ‌ర్ దాటాడు. కానీ ఈసారి చెక్‌పాయింట్ ద‌గ్గ‌ర క‌స్ట‌మ్స్ అధికారులు అత‌న్ని ఆరాతీశారు. డౌట్ వ‌చ్చి అత‌ని బ్యాగ్‌ను చెక్ చేశారు. బ్యాగ్ తెర‌చిన క‌స్ట‌మ్స్ అధికారులు స్ట‌న్ అయ్యారు. ఆ బ్యాగ్‌లో పురుష వీర్య క‌ణాల‌ను స్మ‌గ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు ఆ వ్య‌క్తి. ఈ ఘ‌ట‌న థాయిలాండ్‌లో జ‌రిగింది. వీర్య క‌ణాల‌ను ట్యూబుల్లో అక్ర‌మ స‌ర‌ఫరా చేస్తున్న థాయ్ వ్య‌క్తిని నితిన‌న్ శ్రీత‌నియ‌న‌న్‌గా గుర్తించారు. ప‌క్క‌నే ఉన్న లావోస్‌తో పాటు కంబోడియా దేశాల‌కు నితిన‌న్ దాదాపు 12 సార్లు వెళ్లాడు. అయితే ప్ర‌తిసారీ అత‌ను బ్యాగ్ తీసుకువెళ్తున్నా పోలీసులు మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈసారి ఎందుకో చెక్ చేయ‌డంతో వాళ్ల‌కు నితిన‌న్ గుట్టు తెలిసిపోయింది. అయితే థాయిలాండ్‌లో అద్దెగ‌ర్భాల‌కు అనుమ‌తి లేదు. దీంతో అక్క‌డ‌ స‌ర్రోగ‌సీ క‌ష్టంగా మారింది. దీన్నే వ్యాపారంగా మ‌లుచుకున్న నితిన‌న్ చాలాసార్లు పురుష వీర్య క‌ణాలు ఉన్న ట్యూబ్‌ల‌తో బోర్డ‌ర్ దాటాడు. చైనీస్‌, వియ‌త్నాం వ్య‌క్తుల వీర్య క‌ణాల‌తో స‌రిహ‌ద్దు దాటుతున్న‌ట్లు చివ‌ర‌కు నితిన‌న్ అంగీక‌రించాడు. నైట్రోజ‌న్ ఫ్రీజింగ్ ట్యాంక్‌లో మొత్తం ఆరు వీర్య క‌ణాల ట్యూబ్‌ల‌ను తీసుకెళ్తూ ప‌ట్టుబ‌డ్డాడు. అయితే లావోస్‌, కంబోడియా దేశాల్లో చ‌ట్ట‌ప‌రంగా అద్దె గ‌ర్భాల‌కు అనుమ‌తి ఉంది. థాయిలాండ్ లోని నాంగ్ ఖాయి బోర్డర్ దగ్గర వ్యక్తిని పట్టుకున్నారు.

1628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS