గుహ నుంచి బయటికొచ్చిన బాలల ఫుట్‌బాల్ ఆట: వీడియో

Wed,July 18, 2018 07:06 PM

Thai cave boys play football at first public appearance after rescue

బ్యాంకాక్: థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న 12 మంది బాలురు, కోచ్‌ను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. విహారయాత్రలో భాగంగా తమ ఫుట్‌బాల్ కోచ్‌తో కలిసి గత నెల 22న ఈ గుహకు వచ్చారు. గుహలో చిక్కుకున్న వారిని కనిపెట్టడానికి రెస్క్యూ టీంకు తొమ్మిది రోజులు పట్టింది. వందలాది మంది సహాయక సిబ్బంది నిరంతరం శ్రమించి 18 రోజుల తరువాత వీరిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరందరికి ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. కోలుకున్న తరువాత వీరిని బయటి ప్రపంచానికి పరిచయం చేసేందుకు అనుమతించారు.

బుధవారం వీరంతా మీడియా సమావేశానికి హాజరయ్యారు. వీరిని చూసేందుకు వచ్చిన అభిమానులు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్ ముందు కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆటలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, విలేకరులు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చారు.

థాయిలాండ్‌ గుహ నుంచి బ‌య‌ట‌ప‌డిన వారిని ఈ నెల 19న ఇళ్ల‌కు పంపిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి గ‌త శనివారం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. పూర్తిగా కోలుకోక‌ముందే ఇంటర్వ్యూలో ఇచ్చినట్లైతే గుహలో జరిగినవి పదే పదే గుర్తు చేసుకోవాల్సి వస్తుందని, దానివల్ల మానసికంగా బలహీనపడతారని వైద్యులు కూడా వివ‌రించారు.2340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS