అమెరికాలో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

Wed,February 20, 2019 10:00 PM

telangana man shot dead in US florida

ఫ్లోరిడా: యూఎస్‌లోని ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకున్నది. తెలంగాణకు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో కొత్త గోవర్ధన్ రెడ్డి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి స్టోర్‌లో ఉండగా దుండగులు స్టోర్ లోకి చొరబడ్డారు. అనంతరం గోవర్ధన్ రెడ్డితో పాటు మరొకరిపై కాల్పులు జరిపారు. దీంతో గోవర్ధన్ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గోవర్ధన్ రెడ్డి ఏడేళ్ల క్రితం ఉద్యోగ రిత్యా అమెరికా వెళ్లినట్టు సమాచారం. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

1649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles