బహరేన్‌లో ఘనంగా తెలంగాణ ఆవతరణ సంబురాలు

Fri,June 7, 2019 09:22 PM

telangana formation day celebrations held in bahrain

ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో బహరేన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల ప్రారంభానికి ముందు తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అనంతరం కేక్ కట్ చేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు. ఈసందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ మాట్లాడుతూ... బహరేన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం వేడుకలు ఐదోసారి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అమరవీరుల త్యాగ ఫలంతో, కేసీఆర్ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు విజయపథంలో దూసుకెళ్తూ తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

తెలంగాణను ప్రపంచ వేదికపై పరిచయం చేయడానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామని.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిదని ఆయన స్పష్టం చేశారు.

ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేశ్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, గుమ్ముల గంగాధర్, సెక్రటరీలు సంగేపు దేవన్న, జాయింట్ సెక్రటరీలు నేరెళ్ల రాజు, ప్రమోద్ బొలిశెట్టి, సాయన్న కొత్తూరు, బాజన్న, నడిపి సాయన్న, నరేశ్ ఎల్లుల, రాంబాబు, జాగృతి4 అధ్యక్షులు బాబు రావు తదితరులు పాల్గొన్నారు.

601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles