లండన్‌లో బోనాల ఉత్సవాలు

Sun,July 22, 2018 09:04 PM

Telangana Bonalu Festival Celebrations in London

లండన్‌లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఏన్నారై ఫోరం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు. 7 వందల కుటుంబల సభ్యులు లండన్ విధుల్లో జరిగిన బోనాల ఉరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లండన్ ఎంపీలు విరేంద్రశర్మ, సీమ మల్హోత్ర, ఎ. రాజన్, లండన్ మేయర్ సమియా చౌదరి, కోదాడ ఎమ్మెల్యే పద్మవతిరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి బోనాలు, బతుకమ్మ, పండుగలు పేరు ప్రఖ్యాతులు తీసుకవచ్చాయన్నారు. తెలంగాణ ఏన్నారై ఫోరం అధ్యక్షుడు గంప వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ పండుగలను నిర్వహించేందుకు అన్ని సంఘాలు ఏకమైనట్లు తెలిపారు.

ఈసందర్భంగా చిన్నారులు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లండన్ స్థిరపడి వివిధ రంగాల్లో అగ్రాగామిగా నిలిచిన వారికి ఎంపీలు సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్, కార్యదర్శి భాస్కర్, సభ్యులు రంగు వెంకట్, ప్రవీణ్‌రెడ్డి, మహేశ్, స్వామి, బాలకృష్ణ్ర, సంతోష్, సాయికుమార్, మినాక్షి, వాణి, సుచరిత, ప్రియంక, మంజుల తదితరులు పాల్గొన్నారు.

1099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles