న్యూజిలాండ్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

Sat,June 8, 2019 05:53 PM

Telangana Association of New Zealand celebrated Telangana formation day in Auckland

ఆక్లాండ్: తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఘనంగా జరిగాయి. తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో 700 మంది అతిథులు పాల్గొన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ఎంపీలు ముఖ్య అతిథులుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ప్రారంభం కాగానే.. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

వేడుకల ఏర్పాట్లను ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, వైఎస్ ప్రెసిడెంట్స్ ఉమ, దయానంద్, జనరల్ సెక్రటరీ వినోద్, ట్రెజరర్ అరుణ్ దగ్గరుండి చూసుకున్నారు. వేడుకల్లో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు పాల్గొని ఆతిథులను అలరించారు. ఈసందర్భంగా తెలంగాణ కమ్యూనిటీకి సహాయసహకారాలు అందిస్తున్న వారికి తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ తరుపున సన్మానం చేశారు.


552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles