లండన్‌లో ఘనంగా 'టాక్' బోనాల జాతర వేడుకలు

Thu,July 11, 2019 12:40 PM

tauk celebrates bonala jatara in london

లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకేలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 800 మందికి పైగా ప్రవాస తెలంగాణీయులు హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత కాడ్బరి, ఇండియన్ హైకమిషన్ ప్రతినిధి ప్రేమ్ జిత్, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు హాజరయ్యారు.

ఈసందర్భంగా స్వదేశంలో జరుపుకుంటున్నట్టుగా సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి.. లండన్ వీధుల్లో తొట్టెలను ఊరేగించి.. తెలంగాణ ఆడపడుచులు బోనం ఎత్తుకొని జాతర జరుపుకున్నారు. చాలా ఏళ్లుగా లండన్‌లో బోనాల జాతర జరుగుతున్నప్పటికీ.. ఈసారి మొదటిసారిగా పోతురాజు బోనాల ఊరేగింపులో పాల్గొని వేడుకలకు నూతన శోభను తీసుకొచ్చాడు.

బోనాల ఊరేగింపు తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ కార్యదర్శి రత్నాకర్ కడుదుల స్వాగతోపన్యాసం చేసి కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, టాక్ అడ్వైసరీ చైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షులు స్వాతి బుడగం, అడ్వైజరీ వైస్ చైర్మన్ మట్టా రెడ్డి.. సభ్యులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, సత్య పింగిళి, సత్య చిలుముల, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, శుషుమ్న రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, మమతా జక్కి,  శ్రావ్య, శైలజ, శ్వేతా మహేందర్, శ్రీలక్ష్మి, శ్రీనివాస్, భరత్, రాజేష్ వాకా, వెంకీ, రవికిరణ్, గణేష్,  మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles