టాటా స్టీల్ ప్లాంట్‌లో పేలుళ్లు.. ఇద్దరికి గాయాలు

Fri,April 26, 2019 12:19 PM

Tata Steel says fire at Port Talbot plant under control

హైదరాబాద్ : ఇంగ్లండ్‌లోని టాటా స్టీల్ ప్లాంట్‌లో ఇవాళ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3:35 గంటల సమయంలో.. వేల్స్ పోర్టుటాల్బట్‌లోని టాటా స్టీల్ ప్లాంట్‌లో పేలుళ్లు జరిగినట్లు టాటా స్టీల్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ పేలుళ్లపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు. ద్రవ రూపంలో ఇనుమును ప్లాంట్‌కు తరలిస్తుండగా.. పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పేలుళ్ల కారణంగా ప్లాంట్‌కు సమీపంలోని కొన్ని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు.1163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles