పోలీసుల నుంచి తప్పించుకొని బురదలో చిక్కుకున్నాడు.. వీడియో

Fri,April 20, 2018 05:21 PM

Suspect fleeing cops ends up in swamp in Florida

పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత మళ్లీ వాళ్ల కంట పడకపోతే ఇక ఆ వ్యక్తి దొరే. కాని.. మళ్లీ పోలీసుల కంట పడితే మాత్రం ఆ వ్యక్తి బతుకు బస్టాండే అవుతుంది. సేమ్ ఇలాగే యూఎస్‌లోని ఫ్లొరిడాలో ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకొని అడ్డంగా మళ్లీ దొరికిపోయాడు. బాగానే కష్టపడి వాళ్ల నుంచి తప్పించుకున్నా... బురద గుంటలో చిక్కుకుపోవడంతో పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. అయితే.. మనోడు స్పీడ్‌గా ట్రక్ డ్రైవ్ చేశాడని పోలీసులు అతడి ట్రక్కును ఆపేశారు. దీంతో పోలీసులను చూసి బయపడిన ఆ వ్యక్తి పరుగులంకించుకున్నాడు. దీంతో బురద గుంటలో చిక్కుకుపోయాడు. ఇక పోలీసులు మనోడిని వెతుక్కుంటూ పోలీస్ డాగ్‌ను వెంట వేసుకొని వెళ్లారు. మెడ వరకు బురదలో చిక్కుకుపోయి తల మాత్రం బయట ఉన్న ఆ వ్యక్తిని కనిపెట్టిన పోలీసులు అతడిని పైకి లాగి బేడీలు వేసి కటకటాల్లోకి నెట్టారు. ఇక.. దీనికి సంబంధించిన వీడియోను ఆ వ్యక్తిని వెంబడించిన పోలీసులే తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

3647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles