ఎనిమిది పేలుళ్ల‌లో.. ఆరు చోట్ల ఆత్మాహుతి దాడులే

Mon,April 22, 2019 01:17 PM

suicide bombers carried out attacks, says Srilanka government

హైద‌రాబాద్‌: శ్రీలంకలో ఆదివారం జ‌రిగిన వ‌రుస పేలుళ్ల‌పై ఆ దేశ పోలీసులు విచార‌ణ వేగ‌వంతం చేశారు. మూడు హోట‌ళ్లు, మూడు చ‌ర్చిల‌తో స‌హ మొత్తం 8 ప్రాంతాల్లో జ‌రిగిన పేలుళ్ల‌లో సుమారు 300 మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు. అయితే ప్ర‌భుత్వ విశ్లేష‌ణా విభాగం ఆ పేలుళ్ల‌కు సంబంధించి ఓ కొత్త విష‌యాన్ని వెల్ల‌డించింది. మొత్తం 8 పేలుళ్ల‌లో.. ఆరు పేలుళ్లు ఆత్మాహుతి దాడి వ‌ల్ల జ‌రిగిన‌వే అని తేల్చారు. షాంగ్రిలా, కింగ్స్‌బ‌రీ, సినామోన్ గ్రాండ్ హోట‌ల్స్ వ‌ద్ద జ‌రిగిన పేలుళ్ల‌ను సూసైడ్ బాంబింగ్‌గా నిర్ధారించారు. సెయింట్ ఆంధోనీస్ చ‌ర్చి, సెయింట్ సెబాస్టియ‌న్ చ‌ర్చి, జియోన్ చ‌ర్చిల వ‌ద్ద జ‌రిగిన పేలుళ్ల‌ను కూడా ఆత్మాహుతి దాడులుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మొత్తం ఏడు మంది సూసైబ్ బాంబ‌ర్లు ఈ పేలుళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోందని ప్ర‌భుత్వ నిఘా వ‌ర్గాలు తేల్చాయి. శ్రీలంక‌లో ఉగ్ర‌వాదులు ఈస్ట‌ర్ వేడుక‌ల‌ను టార్గెట్ చేశారు. ఆ పేలుళ్ల‌లో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 290కి చేరుకున్న‌ది. 500 మంది గాయ‌ప‌డ్డారు. 24 మంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

1243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles