ఎలుకా ఎలుకా ఊచ్.. మెట్రో ట్రెయిన్ ఎందుకెక్కావోచ్!

Fri,November 17, 2017 04:07 PM

subway surfing rat in newyork subway metro train

కొంతమందికి పాము అంటే హడల్. మరి కొందరైతే చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు, కప్పలు, ఎలుకలను చూసినా ఆమడ దూరం పరిగెడతారు. లేదంటే బిగ్గరగా అరుస్తారు. అక్కడి నుంచి ఓ జంప్ కొడతారు. మరి.. ఓ మెట్రో ట్రెయిన్‌లో ఎలుక హల్ చల్ చేస్తే ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ఈ ఘటన మంచి ఉదాహ‌ర‌ణ‌. మెట్రో ట్రెయిన్‌లో దూరిన ఓ ఎలుక.. కల్లు తాగిన కోతి లాగ అటూ ఇటూ చిందులేసింది. దీంతో మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దాని ఆగడాలకు తట్టుకోలేక సీట్ల మీదికి ఎక్కారు. న్యూయార్క్‌లోని సబ్‌వే స్టేషన్లలో వెళ్తున్న ఓ మెట్రో ట్రెయిన్‌లో ఓ ఎలుక సృష్టించిన వీరంగం ఇది. న్యూయార్క్ సబ్‌వే స్టేషన్లలో ఎలుకల తాకిడి ఇదేం కొత్త కానప్పటికీ.. మిగితా ఎలుకల్లా కాకుండా ఇది సృష్టించిన బీభత్సంతో ప్రయాణికులు బెదిరిపోయారు. ఇక.. దీని ఆగడాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది.

5300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS