క్లాస్‌మేట్‌ను చంపి..తనను తాను కాల్చుకున్న విద్యార్థి

Thu,November 14, 2019 02:45 PM


మాస్కో: రష్యాలో ఓ విద్యార్థి కాల్పులతో వీరంగం సృష్టించాడు. 19 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో తోటి విద్యార్థి మృతి చెందగా..మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బ్లాగోవెశ్ చెన్‌స్కు పట్టణంలో నిర్మాణరంగానికి చెందిన కాలేజీలో ఈ దారుణం వెలుగుచూసింది. అయితే సమాచారమందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన విద్యార్థిని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో..నిందితుడు తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతి చెందిన విద్యార్థి, గాయపడ్డ విద్యార్థులంతా 17-20 మధ్య వయస్సువారే. తరగతి గదిలో 20 మంది విద్యార్థులున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గత అక్టోబర్‌లో కూడా మాస్కోలోని అన్నెగ్జిడ్ క్రిమియా కాలేజీలో ఓ విద్యార్థి కాల్పులు జరిపి 20 మందిని చంపేయగా..మరో 40 మందికి గాయాలయ్యాయి. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles