పేరెంట్స్ రావడం ఇష్టం లేదు.. విమానానికి బాంబు బెదిరింపు

Fri,January 25, 2019 12:31 PM

Student Calls Hoax Bomb Threat On Flight To Stop Parents From Visiting

పారిస్ : ఓ విద్యార్థికి తన తల్లిదండ్రులు తన వద్దకు రావడం ఇష్టం లేదు. దీంతో ఏకంగా వారు ప్రయాణిస్తున్న విమానంలో బాంబు ఉందని ఎయిర్‌పోర్టుకు బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. 23 ఏళ్ల యువకుడు ఫ్రాన్స్‌లోని రెన్నిస్‌లో నివాసముంటున్నాడు. అతన్ని చూసేందుకు జనవరి 18న లియాన్ నుంచి రెన్నిస్‌కు ఈజీజెట్ విమానంలో తల్లిదండ్రులు బయల్దేరారు. అయితే తల్లిదండ్రులు తన వద్దకు అతనికి ఇష్టం లేదు. దీంతో ఆ విమానంలో బాంబు ఉందని ఎయిర్‌పోర్టు అధికారులకు బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. హుటాహుటిన విమానాన్ని లియాన్‌కు మళ్లించారు. ఆ తర్వాత విచారణ చేపట్టగా.. అది ఫేక్ కాల్ అని తేలింది. అనంతరం ఫోన్ కాల్ చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles