బుర్కాపై నిషేధం !

Tue,April 23, 2019 03:01 PM

హైద‌రాబాద్‌: గ‌త ఆదివారం శ్రీలంక‌లో ఈస్ట‌ర్ వేళ జ‌రిగిన వ‌రుస పేలుళ్ల‌లో బుర్కా ధ‌రించిన మ‌హిళ‌ల పాత్ర ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బుర్కా లేదా నికాబ్‌పై నిషేధం విధించాల‌ని శ్రీలంక ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ది. పేలుళ్ల‌కు సంబంధించిన కేసులో విచార‌ణ చేప‌డుతున్న అధికారుల‌కు కొన్ని న‌మ్మ‌లేని నిజాలు తెలిశాయి. పేలుళ్లు జ‌రిగిన ప్రాంతంలో ఉన్న ఆధారాల‌ను, అనుమానితుల ద‌ర్యాప్తును బ‌ట్టి.. ఎక్కువ మంది మ‌హిళ‌లు బుర్కాలో వ‌చ్చిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ముస్లిం మ‌హిళ‌లు ధ‌రించే బుర్కా లేదా నికాబ్‌ను బ్యాన్ చేయాల‌ని భావిస్తున్నారు. మసీదు పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత బుర్కా నిషేధంపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదే అంశాన్ని అనేక మంది మంత్రులు అధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేన‌తో వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. 1990లో జ‌రిగిన గ‌ల్ప్ యుద్ధం త‌ర్వాతే దేశంలోని ముస్లిం మ‌హిళ‌లు బుర్కా వేసుకోవ‌డం మొద‌లైంది. అంత‌కుముందు ఆ ఆచారం దేశంలో లేద‌ని అధికారులు చెబుతున్నారు. గ‌ల్ఫ్‌వార్ త‌ర్వాత తీవ్ర‌వాదులు బుర్కాలు వేసుకోవ‌డం మొద‌లుపెట్టార‌ని అనుమానిస్తున్నారు. డెమాటిగోడ‌లో జ‌రిగిన పేలుడు త‌ర్వాత బుర్కా ధ‌రించిన చాలా మంది మ‌హిళ‌లు త‌ప్పించుకున్నార‌ని ర‌క్ష‌ణ‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

5001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles