ఉద్యోగుల‌కు షాకిచ్చిన స్పేస్ఎక్స్‌

Sat,January 12, 2019 12:18 PM

Space X to layoff 10 percent of its employees to become much leaner

కాలిఫోర్నియా: ప్రైవేటు అంత‌రిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ షాకింగ్‌ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆ కంపెనీలో ప‌నిచేసే సుమారు 10 శాతం మంది ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు నిర్ణ‌యించింది. ఆ జాబితాలో ఉన్న వారందరికీ ఈమెయిల్ రూపంలో లేఖ‌లను పంపించింది. స్పేస్ఎక్స్ కోసం సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అయితే మార్స్ గ్ర‌హం మీద‌కు మాన‌వుల‌ను పంపేందుకు స్పేస్ఎక్స్ భారీ ప్రాజెక్టు చేప‌ట్టింది. ఆ ప్రాజెక్టుకు ఖ‌ర్చు కూడా భారీగా ఉండ‌నుంది. ఈ నేప‌థ్యంలో కొంత మంది ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు ఎల‌న్ మ‌స్క్ నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు శాటిలైట్ల‌ను నింగిలోకి పంపుతూ.. సంప‌న్న అంత‌రిక్ష సంస్థ‌గా ఉన్న స్పేస్ఎక్స్ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల తొల‌గింపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

1361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles