ఈ ఎడారి ఉన్నట్టు..ఎవరికీ తెలియదు

Mon,April 23, 2018 10:42 PM

southflorida university scientists findout a disert

ఈ భూమ్మీద పురాతన విషయాలు చాలానే మరుగునపడి ఉన్నాయి. పరిశోధకుల అధ్యయనాల్లో వాటిలో చాలామట్టుకు బయల్పడుతూనే ఉంటాయి. అలాంటి అద్భుతమే ఒకటి తాజాగా శాస్త్రవేత్తల సర్వేలో బయటపడింది. అదేమిటంటే..

వాతావరణంపై పరిశోధనల నిమిత్తం పెరు పర్వతశ్రేణులపై డ్రోన్‌లతో చక్కర్లు కొట్టిస్తున్నారు దక్షిణ ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కెమెరాలు బిగింపబడిన ఈ డ్రోన్లు ఎప్పటికప్పుడు అక్కడి దృశ్యాలను బంధిస్తూ.. పరిశోధకులకు చేరవేస్తున్నాయి. ఈ క్రమంలోనే డ్రోన్ కెమెరా బంధించిన కొన్ని చిత్రాలు శాస్త్రవేత్తల బృందాన్ని ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆ పర్వత శ్రేణులకు లోపలి వైపున ఒక ఎడారి ప్రాంతం విస్తరించి ఉన్నట్టు ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఈ ఎడారి ప్రాంతం ఉన్నట్టు..ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఈ ఉపరితలంపై కొన్ని కళాత్మక చిత్రాలు కూడా ఉన్నట్టు ఫోటోల్లో గుర్తించారు శాస్త్రవేత్తలు. డిజైన్లలా ఒక పద్ధతి ప్రకారం గీసిన లైన్లు ఉన్నాయక్కడ. అవి రెండు వేల సంవత్సరాల క్రితం నివసించి నాజ్కా తెగకు చెందిన సంప్రదాయ కళకు నిదర్శనమని నిర్ధారించారు. అందుకే వీటిని నాజ్కా లైన్లుగా నామకరణం చేశారు.

సుమారు యాభై చోట్ల భూమిపై చెక్కినట్టుగా ఉన్న కళాత్మకరూపాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా చెబుతున్నారు. క్రీస్తుశకం 200 నుంచి 700 మధ్య ఇక్కడ నాజ్కా సంస్కృతి జీవించి ఉండేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ నాజ్కా లైన్లు కేవలం కంటికి కనిపించే గీతలు మాత్రమే కాదని, అందులో నిగూడార్థం దాగి ఉందని పరిశోధకులు చెబుతున్నమాట. దాదాపు శతాబ్దం క్రితమే శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నట్టు తెలుస్తున్నా.. పెరులోని పాల్పా ప్రొవిన్స్‌లో తాజాగా కొత్త నాజ్కా లైన్లు దర్శమివ్వడం అక్కడ చరిత్రకు సంబంధించిన మరెన్నో ఆధారాలు ఉన్నట్టు స్పష్టం చేస్తున్నదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. డ్రోన్ కెమెరాలు చిత్రీకరించిన ఫోటోలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయంటున్నారు.

3430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles