సూర్య గ్ర‌హ‌ణంతో అమెరికాకు క‌రెంటు క‌ష్టాలు

Fri,July 14, 2017 12:21 PM

Solar Eclipse Could Wipe Out 9,000 Megawatts of Power Supplies in America

లాస్ఏంజిల్స్: సంపూర్ణ‌ సూర్య గ్ర‌హ‌ణం అమెరికాకు క‌రెంటు క‌ష్టాలు తేనున్న‌ది. అగ్ర‌రాజ్యం అమెరికాలో సౌర విద్యుత్తు కొర‌త ఏర్ప‌డ‌నున్న‌ది. వ‌చ్చే నెల 21వ తేదీన సూర్య గ్ర‌హ‌ణం ఉన్న‌ది. దాని వ‌ల్ల ఆ రోజున సుమారు తొమ్మిది వేల మెగావాట్ల సౌర విద్యుత్తు నిలిచిపోనున్న‌ది. దీంతో అమెరికా అంధ‌కారంగా మారే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు భావిస్తున్నారు. అంత భారీ మొత్తంలో విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డం వ‌ల్ల సుమారు 70 ల‌క్ష‌ల ఇండ్ల‌కు క‌రెంటు స‌ర‌ఫ‌రా ఆగిపోతుంది.

భూమికి, సూర్యుడికి మ‌ధ్య చంద్రుడు రావ‌డం వ‌ల్ల‌ సూర్య గ్ర‌హ‌ణం వ‌స్తుంది. అయితే అతివిశాల‌మైన అమెరికాలో ఈ సంపూర్ణ‌ గ్ర‌హ‌ణ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలున్నాయి. ప‌డ‌మ‌ర రాష్ట్ర‌మైన ఒరిగాన్ నుంచి తూర్పు రాష్ట్ర‌మైన ద‌క్షిణ క‌రోలినా మార్గంలో గ్ర‌హ‌ణ ప్ర‌భావం అధికంగా ఉంటుంది. ఈ రూట్లోనే సుమారు 113 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో అంధ‌కారం ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి. ఆ కారిడార్ రూట్లో ఉన్న సోలార్ ప్యానెల్స్‌కు ఆ రోజున త‌గినంత‌ సౌర శ‌క్తి ల‌భించ‌దు.

ఒరిగాన్ నుంచి క‌రోలినా వ‌ర‌కు ఉన్న కారిడార్‌లో గ్ర‌హ‌ణం రోజున సుమారు తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్ప‌త్తి నిలిచిపోయే అవ‌కాశాలున్నాయి. ఆ విద్యుత్తు శ‌క్తి ఎంత అంటే అది సుమారు తొమ్మిది అణ విద్యుత్తు కేంద్రాలు ఉత్పిత్తి చేసే అంత ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. ఆగ‌స్టు 21న మ‌ధ్యాహ్నాం 1.30 నుంచి 3.40 నిమిషాల వ‌ర‌కు కేవ‌లం న్యూయార్క్‌లోనే 2500 మెగావాట్ల ఉత్ప‌త్తి స‌మ‌స్య‌గా మారుతుంద‌న్నారు. నార్త్ క‌రోలినా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎక్కువ‌గా సోలార్ ప్యాన‌ల్స్ ఉన్నాయి. దాని వ‌ల్ల ఆ రాష్ట్రాల‌కు అధిక ప్ర‌భావం ప‌డే సూచ‌న‌లున్నాయి.

1979లో అమెరికాలో సంపూర్ణ సూర్య గ్ర‌హ‌ణం ఏర్ప‌డింది. అప్పుడు కూడా కొన్ని క‌రెంటు క‌ష్టాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. గ్ర‌హ‌ణం వ‌ల్ల సూర్య ర‌శ్మి త‌గ్గుతుంది. దాని వ‌ల్ల సోలార్ ప్యానెల్స్‌కు సుమారు 70 శాతం సూర్య శ‌క్తి త‌గ్గిపోతుంది. ఆ ఫలితంగా ప్యానల్స్ నుంచి విద్యుత్తు ఉత్ప‌త్తి క‌ష్టంగా మారుతుంది. గ్ర‌హ‌ణం వ‌ల్ల ఒక్కొక్క గ్రిడ్డుకు నిమిషానికి 70 మెగావాట్ల విద్యుత్తు త‌గ్గిపోతుంది. అలా ఆ రోజున సుమారు 83 నిమిషాల పాటు త‌క్కువ విద్యుత్తు ఉత్ప‌త్తి కానున్న‌ది. ఇక ఉష్ణ ప్ర‌దేశాలైన కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో గ్ర‌హ‌ణం రోజున ప‌లు విద్యుత్త స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.

2835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles