అమెరికాలో తెలంగాణవాసి మృతి

Sun,January 28, 2018 11:15 AM

Software Employee Krishna Chaitanya dies in America

అమెరికా : డల్లాస్‌లో తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కృష్ణ చైతన్య డల్లాస్‌లోని ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నారు. తను ఉన్న గది నుంచి కృష్ణ చైతన్య బయటకు రాకపోవడంతో.. ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ గదిని పరిశీలించగా కృష్ణ చైతన్య మృతి చెందినట్లు నిర్ధారించారు. కృష్ణ చైతన్య స్వస్థలం సిద్ధిపేటలోని ప్రశాంత్‌నగర్. చైతన్య మృతదేహం సకాలంలో స్వస్థలానికి వచ్చేలా మంత్రి హరీష్‌రావు చర్యలు తీసుకుంటున్నారు.

2670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles