డోర్ హ్యాండల్‌కు చుట్టుకున్న నల్ల త్రాచు.. వీడియో

Mon,May 28, 2018 04:08 PM

Snake wraps and slithers on door handle in North Carolina

పాము అంటేనే కొంతమందికి హడల్. దాన్ని చూసి ఆమడదూరం పరిగెడతారు. మరికొంతమందైతే పాము పేరు వింటేనే చాలు ఆ ప్రాంతానికి కూడా వెళ్లరు. పాము అంటే అంత భయం. మరి.. అదే పాము ఏకంగా జనావాసాల్లోకి వస్తే. రావడమే కాకుండా ఇండ్లలోకి, ఆఫీసులోకి జొర్రబడితే. ఎలా ఉంటది. ఇదిగో ఇలా ఉంటది. ఓ నల్ల త్రాచు ఏకంగా యూఎస్‌లోని నార్త్ కరోలినా, హంటర్స్‌విల్లేలో ఉన్న నాస్కార్ రేసింగ్ టీమ్ హెడ్‌క్వార్టర్స్ బిల్డింగ్ దగ్గరకు వచ్చింది. లోపలికి వెళ్లే గ్లాస్ డోర్‌ను పాకుతూ ఎక్కింది.

ఇంతలోనే పామును గమనించిన అక్కడి సిబ్బంది డోర్లు క్లోజ్ చేశారు. దీంతో అది డోర్ హ్యాండిల్ మీదనే అటూ ఇటూ జారుతూ కాసేపు అక్కడే ఉంది. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరలవడమే కాదు నెటిజన్లు పామును చూసి దడుసుకుంటున్నారు. వామ్మో... ఇటువంటి పామును నిజంగా చూస్తే రాత్రిళ్లు భయంకరమైన కలలు వస్తాయి బాబోయ్ అని కొందరు, అసలు జనావాసాల్లోకి ఇటువంటి పాములు ఎలా వస్తాయి దేవుడా మరికొందరు కామెంట్లు చేశారు.

5743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS