ఎరక్కబోయి ఇరుక్కున పాము.. బయటికి రాలేక అరిగోస!

Sat,September 22, 2018 03:30 PM

Snake Finds Itself In A Tough Spot and Gets Rescued

సాధారణంగా పాములను చూసి మనుషులు బయపడిపోతారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ పాము తెలియకపోయి స్ప్రింక్లర్ మూతలో ఇరుక్కుపోయింది. ఇక.. దాని బాధ వర్ణణాతీతం. కక్కలేక.. మింగలేక అన్నట్టుగా తయారైంది దాని పరిస్థితి. మూత నుంచి బయటికి రాలేక నానా అవస్థలు పడింది. దాని అవస్థలను గమనించిన కొంతమంది స్థానికులు స్నేక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించడంతో వాళ్లు దానికి విముక్తి కల్పించారు. ఈఘటన యూఎస్‌లోని అరిజోనాలో చోటు చేసుకున్నది. అది రాటిల్ స్నేక్.

రంగంలోకి దిగిన ఫియోనిక్స్ హెర్పెటోలాజికల్ సొసైటీ సిబ్బంది దాన్ని బయటికి తీయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. అది ఎంతకీ బయటికి రాకపోవడంతో దాన్ని వాళ్ల సంస్థకు తీసుకెళ్లి ఆయిల్ పూసి ఎలాగోలా సురక్షితంగా బయటికి తీశారు. అనంతరం దానికి స్నానం చేయించి తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. ఇక.. ఈ స్నేక్ ఇరుక్కుపోయిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

9282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles