ఫుట్‌పాత్‌పై నడుస్తుంటే.. సింక్‌హోల్ మింగేసింది.. వీడియో

Tue,November 13, 2018 12:54 PM

Sinkhole on sidewalk swallows a woman in China

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా రోడ్లు ఊహించని విధంగా కుంగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే చైనాలోనూ ఓ ఘటన జరిగింది. లాంఝౌ అనే నగరంలో ఓ మహిళ ఫుట్‌పాత్ నడుస్తుండగా.. అది అనూహ్యంగా కుంగిపోవడంతో ఆమె అందులో పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అయితే ఇంత పెద్ద ఘటనలోనూ సదరు మహిళ పక్కటెముల గాయంతో బయటపడింది. ఆమె అందులో పడిపోగానే పక్కనే ఉన్న వ్యక్తులు, పోలీసులు సదరు మహిళను బయటకు తీశారు. ఆ సింక్‌హోల్ ఏర్పడటానికి గల కారణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మధ్యే టర్కీలోనూ ఇలాంటిదే ఫుట్‌పాత్‌పై సింక్‌హోల్ ఏర్పడటంతో ఇద్దరు యువతులు గాయపడిన విషయం తెలిసిందే.

1485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles