అమెరికా చరిత్ర‌లో ష‌ట్‌డౌన్ రికార్డు

Sat,January 12, 2019 12:02 PM

Shutdown becomes longest federal closure in US history

వాషింగ్ట‌న్: అమెరికా చ‌రిత్ర‌లో మ‌రో కొత్త అధ్యాయం మొద‌లైంది. గ‌త కొన్ని రోజులు అమెరికా ప్ర‌భుత్వం పాక్షికంగా స్తంభించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్ర‌తిష్టంభ‌న 22 రోజుల‌కు చేరుకున్న‌ది. ఇంత సుదీర్ఘ కాలం ప్ర‌భుత్వం స్తంభించ‌డం అమెరికా చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. ష‌ట్‌డౌన్ వ‌ల్ల కొంత మంది ఉద్యోగుల‌కు ఇంకా జీతాలు అంద‌లేదు. వాస్త‌వానికి ఈ వార‌మే కొంత మందికి జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే వారికి పేస్లిప్స్ అందాయి కానీ జీతాలు మాత్రం ప్ర‌భుత్వం చెల్లించ‌లేక‌పోయింది. ద్ర‌వ్య బిల్లుకు అనుమ‌తి ద‌క్కితేనే ఆ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. కానీ బోర్డ‌ర్ వాల్‌కు నిధులు కేటాయించ‌కుండా.. ద్ర‌వ్య బిల్లుకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని ట్రంప్ తీర్మానించిన విష‌యం తెలిసిందే. సుమారు 8 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌కు ఈ నెల జీతం అంద‌లేదు.

1342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles