బ్యాంక్‌లో అయిదుగుర్ని కాల్చి చంపేశాడు..

Thu,January 24, 2019 09:29 AM

shooting in SunTrust Bank, five killed in Florida

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. సెబ్రింగ్ ప‌ట్ట‌ణంలో ఉన్న స‌న్ ట్ర‌స్టు బ్యాంక్‌లో ఓ సాయుధుడు అయిదుగుర్ని కాల్చి చంపాడు. ఆ విష‌యాన్ని అత‌నే పోలీసుల‌కు ఫోన్ చేసి చెప్పాడు. అయితే అక్క‌డ‌కు వ‌చ్చిన స్వాట్ పోలీసులు అత‌న్ని అరెస్టు చేశాయి. బ్యాంక్‌లో అయిదుగుర్ని కాల్చి చంపిన వ్య‌క్తిని 21 ఏళ్ల జీఫెన్ జేవ‌ర్‌గా గుర్తించారు. పోలీసులు ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘ‌ట‌న స‌మ‌యంలో బ్యాంక్‌లో అయిదుగురు మాత్ర‌మే ఉన్న‌ట్లు తేలింది. బ్యాంక్‌లోకి గ‌న్‌తో వెళ్లిన జేవ‌ర్‌.. అక్క‌డ ఉన్న వారిని నేల‌పై ప‌డుకోమ‌న్నాడు. ఆ త‌ర్వాత ఆ అయిదుగుర్ని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపాడు. క్రైమ్ జ‌రిగిన బ్యాంక్‌కు పోలీసులు చేరుకోగానే.. అత‌ను వాళ్ల‌కు లొంగిపోయాడు. ఆ నిందితుడు వీడియోను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఒర్లాండో న‌గ‌రానికి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ విషాద ఘ‌ట‌న ప‌ట్ల దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌న్‌ట్ర‌స్టు బ్యాంక్ త‌న ట్వీట్‌లో వెల్లడించింది. ఉన్మాది జేవ‌ర్ గ‌తంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అయితే ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా అత‌న్ని ఆ ఉద్యోగం నుంచి తొల‌గించారు.1624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles