పెర‌ల్ హార్బ‌ర్ నౌకాశ్ర‌యంలో కాల్పుల ఘ‌ట‌న‌

Thu,December 5, 2019 08:03 AM

హైద‌రాబాద్‌: అమెరికా సైనిక స్థావ‌రం పెర‌ల్ హార్బ‌ర్‌లో కాల్పులు ఘ‌ట‌న జ‌రిగింది. ఆ కాల్పుల్లో అనేక మంది గాయ‌ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలిసింది. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. హ‌వాయిలోని హోన‌లూలూలో ఉన్న పెర‌ల్ హార్బ‌ర్ జాయింట్ బేస్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పుల ఘ‌ట‌న‌తో నౌకాద‌ళ బేస్‌ను కొన్ని గంట‌ల పాటు లాక్‌డౌన్ చేశారు. కాల్పుల్లో ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్లు ఓ స్థానిక న్యూస్ ఏజెన్సీ చెప్పింది. అమెరికా నౌకాద‌ళ సైన్యానికి పెర‌ల్ హార్బ‌ర్ కేంద్రంగా ఉన్న‌ది. ఇక్క‌డ భారీ నౌక‌ల‌కు రిపేర్‌, మెయింటేన్ చేస్తారు. వాటిని ఆధునీక‌రిస్తారు. పెర‌ల్ హార్బ‌ర్‌లోనే సుమారు 10 డెస్ట్రాయ‌ర్లు, 15 స‌బ్‌మెరైన్లు కూడా ఉన్నాయి. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో జ‌పాన్ దాడి చేసింది ఈ నాకౌశ్ర‌యంపైనే. ఈ శ‌నివారం ఆ దాడికి 78 ఏళ్ల నిండ‌నున్నాయి.

382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles