యోగా స్టూడియోలో కాల్పులు.. ఇద్ద‌రు మృతి

Sat,November 3, 2018 09:44 AM

shoot out in Florida Yoga Studio, two killed

ఫ్లోరిడా: అమెరికాలో ఓ ఉన్మాది కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. ఫ్లోరిడాలోని ఓ యోగా స్టూడియోలో అత‌ను కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో ఆరుగురు గాయప‌డ్డారు. అందులో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. కాల్పులు చేసిన త‌ర్వాత సాయుధ ఉన్మాది త‌న‌ను తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌ల‌హాసీలోని హాట్ యోగా స్టూడియోలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గాయ‌ప‌డ్డ‌వారిని పోలీసులు స‌మీప హాస్ప‌ట‌ల్స్‌కు తీసుకువెళ్లారు. అయితే ఏ కార‌ణం చేత ఆ సాయుధు దాడి చేశాడ‌న్న విష‌యాన్ని పోలీసులు వెల్ల‌డించ‌లేదు.

636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles