విన్యాసాలయందు ఈ విన్యాసం వేర‌యా..వీడియో

Thu,July 19, 2018 12:56 PM

Shock And Screams of couple stunts

ఈ మ‌ధ్య కాలంలో రియాలిటీ షోస్‌కి ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క భాష‌కే ప‌రిమితం కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ ప్ర‌ముఖ ఛానెల్స్ అన్నీ డిఫ‌రెంట్ రియాలిటీ షోస్ ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో పాల్గొనే వారు క‌ళ్ళు చెదిరే విన్యాసాలు చేస్తూ న్యాయ నిర్ణేత‌ల‌తో పాటు వీక్ష‌కుల ఒళ్ళు గ‌గుర్పొడిచేలా చేస్తున్నారు. తాజాగా టైస్ సిస్లెన్‌, మారీ వోల్ఫ్ నిస్లెన్ అనే దంప‌తులు ఓ రియాలిటీ షోలో భాగంగా ఇంత‌క‌ముందెన్న‌డూ చూడ‌ని విన్యాసాలు చేసి ప్ర‌తి ఒక్క‌రు అబ్బుర‌పోయేలా చేశారు. ప‌ట్టు త‌ప్పితే ప్రాణం పోతుందేమో అనే భ‌యం వీరి సాహ‌స‌కృత్యాల‌ని చూస్తున్న‌ ప్ర‌తి ఒక్కరి క‌ళ్ళ‌లో క‌నిపించింది. రెండేళ్ల కొడుకు ముందు వారు ఈ విన్యాసాలు చేస్తుండ‌గా, ఆ బుడ‌త‌డు త‌ల్లి తండ్రుల స్టంట్స్‌ని తీక్ష‌ణంగా వీక్షించాడు. అమెరికాస్ గాట్ టాలెంట్ అనే సంస్థ త‌మ సోష‌ల్ మీడియాలో ఈ దంప‌తుల సాహ‌స విన్యాసానికి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

3652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS