మెడిటేరియన్ సముద్రంలో నౌక ప్రమాదం

Thu,August 6, 2015 11:15 AM

ship wreck in mediterranean sea

మెడిటేరియన్ సముద్రంలో నౌక మునిగిన ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. సుమారు 600 మంది వలసదారులు ప్రయానిస్తున్న మత్సకార బోటు బుధవారం మునిగిపోయింది. లిబియా రాజధాని ట్రిపోలికి ఉత్తర-పడమర తీరాన సుమారు 110 కిమి దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇప్పటి వరకు 25 మృతదేహాలు వెలికితీయడంతో పాటు, 400 మంది వలసదారులను కాపాడినట్లు ఇటాలియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ ఫిలిప్పో మారిని తెలిపారు. అలాగే గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు.

1165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles