క్యాబేజీ కొనడానికి వెళ్తే కోటిన్నర లాటరీ తగిలింది..

Wed,December 5, 2018 04:39 PM

She Went To Buy Cabbage, Ended Up With $2,25,000 Lottery Jackpot

ఓ మహిళ క్యాబేజీ కొనడానికి స్టోర్‌కు వెళ్లింది. పొద్దుపొద్దుగాల ఎవరి ముఖం చూసిందో కానీ.. లక్కు తోకను తొక్కింది. ఏకంగా కోటిన్నర లాటరీని గెలిచింది. ఈ ఘటన యూఎస్‌లోని మేరీలాండ్‌లో చోటు చేసుకున్నది. వానెస్సా వార్డ్ అనే మహిళ గ్రోసరీ స్టోర్‌కు వెళ్లింది. తన తండ్రి క్యాబేజీ తీసుకురా అని చెబితే.. స్టోర్‌కు వెళ్లి క్యాబేజీ కొనుగోలు చేసింది. తర్వాత అక్కడే ఉన్న స్పిన్ వీల్ తనను ఆకర్షించింది. విన్ ఏ స్పిన్ స్క్రాచ్ ఆఫ్ టికెట్‌ను కొన్నది.

ఆ స్పిన్ వీల్ టికెట్ తీసుకున్న వాళ్లకు ఓ స్క్రాచ్ కార్డు ఇస్తారు. ఆ స్క్రాచ్ కార్డును గీకితే.. 5,00,000 లక్షల డాలర్ల వరకు గెలుచుకునే చాన్స్ ఉంటుందన్న మాట. టికెట్ తీసుకొని ఇంటికి వెళ్లింది. ఏదో ఊరికే.. కార్డును గీకింది. అంతే.. నోరెళ్లబెట్టింది. ఎందుకంటే.. ఆమె 2,25,000 డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకుంది. అంటే మన కరెన్సీలో 1.5 కోట్ల రూపాయలు అన్నమాట. అది కదా లక్కంటే. ఇక.. ఈ డబ్బులతో ఏం చేస్తావు అని ఆమెను అడిగితే.. ఏం చెప్పిందో తెలుసా? రిటైర్‌మెంట్ తర్వాత తనకు ఆ డబ్బులు ఉపయోగపడేలా ప్లాన్ చేసుకుంటున్నదట. అంతే కాదు.. అందులోని కొన్ని డబ్బులతో డిస్నీ వరల్డ్ ట్రిప్‌కు వెళ్తుందట.

3483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS