హెహెహేహె.. విమానంలో విండో సీటు కావాలన్నాడని...!

Thu,November 15, 2018 03:55 PM

See Flight Attendant Hilarious Response To Man Who Kept Complaining About Seat

ఎర్రబస్సులోనే కాదు విమానంలో కూడా విండో సీటు కోసం ప్రయాణికులు ఆరాటపడతారు అనడానికి ఈఘటనే ఉదాహరణ. ఓ ప్రయాణికుడికి విమానంలో విండో సీటు దొరకలేదు. దీంతో తనకు విండో సీటు కావాలంటూ విమాన సిబ్బందిని తెగ ఇబ్బంది పెట్టాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ ఏం చేసిందో తెలిస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. పగలబడి మరీ నవ్వుతారు. ఈ ఘటన జపాన్‌లో జరిగింది. జపాన్ నుంచి వెళ్తున్న ఓ విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తనకు విండో సీటు కావాలంటూ ఓ ఎయిర్ హోస్టెస్‌ను తెగ ఇబ్బంది పెట్టాడు ఆ ప్రయాణికుడు. విండో సీటు అవేలబుల్‌లో లేదు అని ఆమె ఎంత మొత్తుకున్నా మనోడు వినలేదు. పదే పదే ఆమెను విండో సీటు కోసం విసిగిస్తుండటంతో ఏం చేయాలో తెలియక... ఓ పేపర్‌పై విండో సీటును గీసి.. అతడి సీటు పక్కన అతికించింది ఆ హోస్టెస్. అంతే.. వెంటనే మనోడు నోరు మూసుకున్నాడట. అప్పటి నుంచి విమానం దిగేదాకా కిక్కుమనలేదట మనోడు. ఆ ఫోటోపై నెటిజన్లు కూడా భలే నవ్వుకుంటున్నారు. ఎయిర్ హోస్టెస్ భలే సమాధానం చెప్పిందే అంటూ ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు.
10229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles