లంక పేలుళ్లు.. ముగ్గురు పిల్ల‌ల్ని కోల్పోయిన బిలియ‌నీర్

Mon,April 22, 2019 02:25 PM

Scotland billionaire lost his three children in Srilanka blasts

హైద‌రాబాద్‌: శ్రీలంక పేలుళ్లు.. స్కాట్‌ల్యాండ్ బిలియ‌నీర్‌కు తీర‌ని దుఖ్కాన్ని మిగిల్చాయి. భూలావాదేవీలు నిర్వ‌హించే వ్యాపార‌వేత్త అయిన ఆండ‌ర్స్ హోల్చ్ పొసెన్‌కు చెందిన ముగ్గురు పిల్ల‌లు లంక పేలుళ్ల‌లో ప్రాణాలు కోల్పోయారు. పొసెన్ మొత్తం న‌లుగురు పిల్ల‌లు. అయితే ఈస్ట‌ర్ వేడుక‌ల కోసం ఆయ‌న‌కు చెందిన ముగ్గురు పిల్ల‌లు శ్రీలంకకు వెళ్లారు. పేలుళ్ల ఘ‌ట‌న‌కు మూడు రోజుల ముందు పొసెన్ కూతురు అల్మా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. త్రీ లిటిల్ బియ‌ర్స్ అంటూ ఆ ఫోటోకు ఓ ట్యాగ్ కూడా పెట్టింది. అయితే ఈ ఘ‌ట‌న ప‌ట్ల బిలియ‌నీర్ పొసెన్‌, ఆయ‌న భార్య ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి స‌మాచారాన్ని వెల్ల‌డించింది. పొసెన్ ఆస్తులు సుమారు 450 కోట్ల పౌండ్లు అని తెలుస్తోంది.

3575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles