విద్యార్థులను చంపి.. రక్తం తాగి.. చావాలనుకున్న ఇద్దరమ్మాయిలు

Fri,October 26, 2018 03:56 PM

school girls waited in a bathroom and planned to cut up their classmates in Florida

అది ఫ్లోరిడా.. ఓ మాధ్యమిక పాఠశాలలో ఇద్దరమ్మాయిలు చదువుతున్నారు. వారి వయసు 11, 12 సంవత్సరాలు మాత్రమే. ఆ ఇద్దరూ.. 15 నుంచి 25 మంది విద్యార్థులను చంపి.. వారి రక్తం తాగి, మాంసం ముద్దలను తిని.. చిరవకు తమకు తామే కత్తితో పొడుచుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సైతాన్ దగ్గరికి వెళ్లాలనే ఆలోచనతో ఈ కుట్రకు తెరలేపారు ఆ విద్యార్థినులిద్దరూ.

గత వారం రోజుల నుంచి పాఠశాలకు వెళ్లకుండా.. ఓ విద్యార్థిని ఇంట్లో ఇద్దరూ కలిసి భయంకరమైన వీడియోలు చూశారు. సైతాన్ వీడియోల పట్ల ఆకర్షితులైన ఆ ఇద్దరు విద్యార్థినుల మనసుల్లో క్రూరత్వం నిండిపోయింది. కనీసం 15 నుంచి 25 మంది విద్యార్థులను చంపాలని నిర్ణయించుకున్నారు. అలా అనుకున్న మరు క్షణమే.. కత్తులు, బ్లేడులు, పిజ్జా కట్టర్‌ను సమకూర్చుకున్నారు. ఇక వారం రోజుల తర్వాత తిరిగి పాఠశాలకు వచ్చారు ఇద్దరమ్మాయిలు.

మొదటి పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు బాత్‌రూమ్‌లోకి వెళ్లి.. తమకన్నా చిన్న వయసున్న విద్యార్థులను చంపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వీరి గుసగుసలను పాఠశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ విని ఆఫీస్ రూమ్‌లోకి తీసుకెళ్లాడు వారిని. ఆ ఇద్దరు విద్యార్థినులు తెలివిగా తమ దుస్తుల కింద కత్తులు, పిజ్జా కట్టర్‌ను ఉంచుకున్నారు. వాటన్నింటిని బయటకు తీయడంతో సిబ్బంది షాక్ అయ్యారు. ఆ తర్వాత విద్యార్థినులను పోలీసులు విచారించగా.. భయంకరమైన సైతాన్ వీడియోలు చూడటం వల్లే వాటికి ప్రేరేపితమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులను చంపి వారి రక్తం తాగి, మాంసం తిని తాము కూడా ఆత్మహత్య చేసుకోని సైతాన్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఇద్దరు అమ్మాయిలు. విద్యార్థినులను జువైనల్ హోంకు తరలించారు పోలీసులు.

4017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles