అది చేప కాదు.. రాకాసి.. పిరాన్హా చేపకు ముత్తాత.. వీడియో

Fri,September 28, 2018 03:12 PM

savage fish eating poisonous creatures video goes viral

మీరు పిరాన్హా సినిమా చూశారా? అందులో పిరాన్హా అని పిలవబడే చేపలు మనుషులను ఎలా పీక్కుతింటాయో చూశారుగా. ఇప్పుడు మీరు చూడబోయే చేప ఆ పిరాన్హా చేపలకు ముత్తాతలా ఉంటుంది. అవి కేవలం మనుషులనే పీక్కతిన్నాయి కానీ.. ఇది మాత్రం విషపూరితమైన ప్రాణులన్నింటినీ లపలపా లాగించేస్తున్నది. చూడటానికి మాత్రం ఎంతో ముద్దుగా ఉంటుంది ఈ చేప కానీ.. అది ముద్దులొలికే చేప కాదు రాకాసి చేప. జెర్రీ, తేలు, పాము, జలగ.. అనే తేడా లేకుండా ఏది పడితే దాన్ని తినేయడమే దానికి తెలుసు. ఆక్వేరియంలో ఉన్న ఆ చేపకు లోపల దేన్ని వేసినా లటక్కున మింగేస్తోంది. ఇంతకీ.. ఎక్కడుంది ఈ చేప అంటారా? ఏమో ఎవరికి తెలుసు. సోషల్ మీడియాలో ఈ చేపకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆ వీడియోకు 50 లక్షల వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఆ వీడియో చూస్తారా?

5285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles