ఐదు ట్రక్కుల్లో పాక్‌కు చేరుకున్న సౌదీ ప్రిన్స్ వ్యక్తిగత సామాగ్రి

Tue,February 12, 2019 09:42 AM

Saudi Crown Prince's Personal Amenities Reach Pakistan

ఇస్లామాబాద్: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ వారంలో పాకిస్తాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత సామాగ్రి ఐదు ట్రక్కుల్లో ఇస్లామాబాద్‌కు చేరుకుంది. పలు వ్యాపార ఒప్పందాల నిమిత్తం సల్మాన్.. పాక్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. భద్రతా కారణాల రీత్యా ఏ తేదీల్లో పర్యటించేది తెలుపనప్పటికీ అందుకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. యువరాజు వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పలువురు మీడియా ప్రతినిదులు పాక్‌కు చేరుకున్నారు. మహ్మద్ బిన్ సల్మాన్.. పాక్ ప్రధాని నివాసంలో బస చేయనున్నారు. కాగా యువరాజు సిబ్బంది కోసం ఇస్లామాబాద్‌లోని టాప్ హోటళ్లు రెండు పూర్తిగా బుక్ అయ్యాయి. మరో రెండు హోటళ్లు పాకిక్షింగా బుక్ అయ్యాయి.

4564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles