ప్రిన్స్ స‌ల్మానే ఆ హ‌త్య చేయించాడు...

Sat,November 17, 2018 08:20 AM

Saudi crown prince Salman ordered assassination of journalist Khashoggi, tells CIA

వాషింగ్ట‌న్: జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గిని సౌదీ యువ‌రాజు మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ హ‌త్య చేయించార‌ని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ సీఐఏ పేర్కొన్న‌ది. ఈ కేసులో ద‌ర్యాప్తును పూర్తి చేసిన సీఐఏ చివ‌ర‌కు త‌న నివేదిక‌ను వెల్ల‌డించింది. ప్రిన్స్ స‌ల్మాన్ ఆదేశాల ప్ర‌కార‌మే ఖ‌షోగ్గి హ‌త్య జ‌రిగింద‌ని సీఐఏ స్ప‌ష్టం చేసింది. సౌదీ అరేబియా తీసుకున్న అనేక జాతీయ‌, అంత‌ర్జాతీయ విధానాల‌ను ఖ‌షోగ్గి వ్య‌తిరేకించారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబ‌సీకి వెళ్లిన అత‌న్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న ట్రంప్ ప్ర‌భుత్వం సౌదీపై వ‌త్తిడి తెచ్చింది. అమెరికాకు చెందిన టాప్ ర్యాంక్ అధికారులు కూడా ఖ‌షోగ్గి హ‌త్య విష‌యంలో ప్రిన్స్ స‌ల్మాన్‌నే అనుమానిస్తున్నారు.

మ‌రోవైపు వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో 17 మంది సౌదీ దేశస్థులపై అమెరికా ఆంక్షలు విధించింది. సౌద్ అల్ ఖహ్తానీ, అతడి సబార్డినేట్ మహెర్ ముత్రేబ్, టర్కీలోని సౌదీ కాన్సుల్ జనరల్ మహమ్మద్ అలోతైబీలతోపాటు 14 మంది కలిసి.. ఖషోగ్గిని హత్య చేసినందుకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. అమెరికాలోని వారి ఆస్తులను జప్తు చేశామన్నారు. హంతకులంతా సౌదీ అరేబియా ప్రభుత్వంలోని వివిధ సంస్థల్లో వివిధ స్థాయిల్లో పని చేస్తున్న వారే.

1898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles