పాక్‌లో సౌదీ రాజు పర్యటన ఆలస్యం..

Sat,February 16, 2019 02:31 PM

ఇస్లామాబాద్: సౌదీ ఆరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్‌లో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16,17 తేదీల్లో ఆయన పాక్‌లో పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన కాస్త ఆలస్యమైంది. శనివారం నుంచి ప్రారంభంకావాల్సిన ఆయన విదేశీ పర్యటన ఆదివారం నుంచి యథావిధిగా కొనసాగనుందని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. సౌదీ రాజు వెంట పెద్ద ఎత్తున వ్యాపార ప్రతినిధులు ఇక్కడకు రానున్నారు. పర్యటనలో మార్పులు, ఆలస్యంపై పాక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని సౌదీ రాజు సల్మాన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే వారం సౌదీ రాజు తమ దేశ వ్యాపార ప్రతినిధులతో భారత్‌కు రానున్నారు.

5082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles