సింగర్‌ను కౌగిలించుకొని జైలుకెళ్లింది.. వీడియో

Sun,July 15, 2018 01:37 PM

Saudi Arabia Woman arrested for hugging a male singer at a concert

రియాద్: ఓ మేల్ సింగర్‌ను కౌగిలించుకున్నదని సౌదీ అరేబియాలో ఓ అమ్మాయిని అరెస్ట్ చేశారు. సింగర్ మాజిద్ అల్ మొహందిస్ ఓ కాన్సర్ట్‌లో పాటలు పాడాడు. ఆ కాన్సర్ట్ ముగియగానే ఓ అమ్మాయి వెళ్లి అతన్ని హగ్ చేసుకుంది. సౌదీ చట్టాల ప్రకారం అక్కడి మహిళలు తమకు సంబంధం లేని మగవారితో దూరంగా ఉండాలి. దీంతో పోలీసులు వెంటనే ఆ యువతిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ప్రిన్స్ ఆఫ్ అరబ్ సింగింగ్‌గా పేరున్న మొహందిస్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఈ షో తర్వాత కూడా ఇలాగే ఆ అమ్మాయి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను దూరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించినా.. ఆమె వినలేదు. సౌదీలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు అంతగా స్వేచ్ఛ ఉండదు. ఈ మధ్యే ఒక్కో చట్టాన్ని కాస్త సడలిస్తూ వస్తున్నారు. కారు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించారు. ఇలాగే కాన్సర్ట్‌లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు మహిళలకు అనుమతి ఇచ్చారు.

4433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles