హైస్పీడ్ రైలు సేవలను ప్రారంభించిన సౌదీ రాజు

Tue,September 25, 2018 08:31 PM

Saudi Arabia launches high speed rail project

సౌదీ అరేబియా ప్రభుత్వం హైస్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించింది. హోలీ సిటీస్‌గా పేరు పొందిన మక్కా, మదీనా పట్టణాల మధ్య నడువనున్న హైస్పీడ్ రైలును సౌదీ రాజు సల్మాన్ ప్రారంభించారు. ది హరామైన్ హైస్పీడ్ రైలు సిస్టమ్ రోజువారీ ప్రయాణికులతోపాటు ముస్లిం యాత్రికులను గమ్యస్థానాలను చేర్చనుంది. మక్కా, మదీనా పట్టణాల మధ్య జెడ్డాలోని రెడ్ సీ పోర్టు మీదుగా సుమారు 450 కిలోమీటర్లలో హైస్పీడ్ రైలు నడుపనున్నారు. మధ్యప్రాచ్య (పశ్చిమాసియా, టర్కీ, ఈజిప్ట్) దేశాల్లోని రవాణా వ్యవస్థలో హైస్పీడ్ రైలు అత్యంత పెద్ద ప్రాజెక్టు అని హరామైన్ ప్రాజెక్టు మేనేజర్ మహ్మద్ ఫలాహ వెల్లడించారు.

3632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS