ఇండియాను వెనక్కి నెట్టిన సౌదీ అరేబియా!

Tue,March 12, 2019 01:21 PM

Saudi Arabia displaces India as largest Importer of Weapons

న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఇండియాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలిచింది సౌదీ అరేబియా. దీంతో ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ ఇన్‌స్టిటూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ).. ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్‌ఫర్స్-2018 పేరుతో రిలీజ్ చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. 2014-18 మధ్య కాలంలో ఇండియా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలిచింది. మొత్తం ఆయుధాల దిగుమతిలో 9.5 శాతం మేర ఇండియా దిగుమతి చేసుకుంది అని ఈ సంస్థ వెల్లడించింది. గతేడాది కూడా 13 శాతం దిగుమతులతో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్ నిలిచింది. అయితే ఈసారి మాత్రం సౌదీ అరేబియా.. ఇండియాను వెనక్కి నెట్టడం విశేషం. ప్రతి ఐదేళ్ల కాలానికి ఈ ఆయుధాల దిగుమతి లెక్కలను పరిగణనలోకి తీసుకుంటుంది. విదేశాల నుంచి ఆయుధాల డెలివరీ ఆలస్యం కావడం వల్లే భారత్ దిగుమతులు తగ్గిపోయాయని ఎస్‌ఐపీఆర్‌ఐ తెలిపింది. ప్రస్తుత ఐదేళ్ల కాలంలో రష్యా నుంచి ఎంఐ-17-వీ5 హెలికాప్టర్లు, అమెరికా నుంచి సముద్ర తీర నిఘా విమానాలు (బోయింగ్ పీ8-ఐ), ఇజ్రాయెల్ నుంచి యూఏవీలు, రాడార్లు దిగుమతి చేసుకున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఇక 2011-15 మధ్య అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేసిన దేశాల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉన్న చైనా.. వాటిలో 53 శాతం ఆయుధాలను కేవలం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు మాత్రమే చేస్తుండటం గమనార్హం.

6467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles