ఆకాశంలో మెరుపులు ఎలా వస్తాయో తెలుసా.. వీడియో

Thu,May 24, 2018 11:55 AM

Satellite captures footage of lightning from space

సాధారణంగా వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటం సహజం. అయితే.. ఉరుములు, పిడుగులను పక్కన బెడితే.. ఆకాశంలో మెరుపులు ఎలా మెరుస్తాయో ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థకు చెందిన ఎన్‌ఓఏఏ జీవోఈఎస్-17 అనే శాటిలైట్ రికార్డు చేసిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఈ సంస్థ పోస్ట్ చేసింది.

నార్త్, సౌత్ అమెరికాపైన మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ మేఘాల్లోంచి పుట్టుకొచ్చిన మెరుపులను రికార్డు చేసింది. జియోస్టేషనరీ లైట్నింగ్ మ్యాపర్ ద్వారా ఆ శాటిలైట్ మెరుపులకు సంబంధించిన డేటాను పంపించింది. యానిమేషన్ రూపంలో ఉన్న ఆ వీడియోను ఈ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు.ఎన్‌వోఏఏ శాటిలైట్ పంపించిన మొదటి డేటా ఇదే. ఆకాశంలో అనూహ్యంగా ఏర్పడే మార్పులను పసిగట్టి దానికి సంబంధించిన రిపోర్ట్‌ను ఈ శాటిలైట్ సంస్థకు పంపిస్తుంది. ఉరుములతో కూడిన గాలివాన వచ్చినప్పుడు దాని తీవ్రతను తెలియజేస్తుంది. రాడార్‌తో పనిచేసే ఈ శాటిలైట్ జియోస్టేషనరీ లైట్నింగ్ మ్యాపర్‌ను ఉపయోగించి భవిష్యత్తులో తలెత్తే వినాశనాలను పసిగడుతుంది.

4420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles