ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ సాఫ్ట్‌వేర్‌ మాకొద్దు..

Wed,May 15, 2019 11:57 AM

San Francisco is first US city to ban facial recognition

హైద‌రాబాద్‌: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో న‌గ‌రం సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్న‌ది. టెక్నాల‌జీ విప్ల‌వానికి కేంద్ర బిందువైన ఆ న‌గ‌రం ఇప్పుడు ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ సాఫ్ట్‌వేర్ వాడ‌కంపై నిషేధం విధించింది. పోలీసులు, ఇత‌ర ఏజెన్సీలు ఆ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించ‌రాదంటూ చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులు తీర్మానించారు. వాస్త‌వానికి చిన్న చిన్న నేర‌స్తులు, అనుమానితుల‌ను ప‌ట్టుకునేందుకు అమెరికా పోలీసులు ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ సాఫ్ట్‌వేర్‌ను ఎక్కువ‌గా వాడుతుంటారు. అయితే ఇప్పుడా టెక్నాల‌జీ వినియోగించాలంటే అనుమ‌తి తీసుకోవాల‌ని శాన్‌ఫ్రాన్సిస్‌కో ప్ర‌తినిధులు తేల్చారు. గ‌త ఏడాది అన్నాపోలిస్‌లో జ‌రిగిన సామూహిక కాల్పుల ఘ‌ట‌న‌లో అనుమానితుల‌ను గుర్తించేందుకు ఈ టెక్నాల‌జీని వాడారు. దీనిపై పౌర‌హ‌క్కుల నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. నిఘా వ్య‌వ‌స్థ మితిమీరుతున్న‌ద‌ని పౌర‌నేత‌లు ఆరోపించారు.

626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles