రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు.. వీడియో

Mon,May 21, 2018 05:51 PM

Sales Man catches girl falling from 2 storey building in china

అది చైనాలోని చాంగ్‌క్వింగ్ సిటీ. మే 15, 2018. ఓ షాపుకు చెందిన సేల్స్ మాన్ ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతూనే తన షాపు బయట ఓ లుక్కేశాడు. అంతే వెంటనే ఫోన్‌ను అక్కడ పడేసి బయటికి పరిగెత్తాడు. ఏం జరిగిందని అంతా అక్కడికొచ్చి చూసి షాకయ్యారు. ఆ వ్యక్తి రెండో ఫ్లోర్ నుంచి పడుతున్న ఓ చిన్నారిని కిందపడకుండా పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక.. అప్పటి నుంచి ఆ సేల్స్ మాన్ కాస్త హీరో అయిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

7750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles