70 అంత‌స్తుల భ‌వ‌నంపై మోడ‌ల్ డేరింగ్ స్టంట్‌Fri,February 17, 2017 01:15 PM
70 అంత‌స్తుల భ‌వ‌నంపై మోడ‌ల్ డేరింగ్ స్టంట్‌

దుబాయ్‌: ర‌ష్య‌న్ మోడ‌ల్ వికి ఒడింక్టోవా చేసిన ఓ డేరింగ్ స్టంట్‌.. ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దుబాయ్‌లోని 70 అంత‌స్తుల కాయ‌న్ ట‌వ‌ర్‌పై ఒడింక్టోవా ఈ స్టంట్ చేసింది. ఆ 70 అంత‌స్తుల భ‌వ‌నంపై నుంచి ఆమె వేలాడుతూ ఫొటోల‌కు పోజిచ్చింది. ఆమెకున్న ఏకైక ర‌క్ష‌ణ‌ డైరెక్ట‌ర్ అలెగ్జాండ‌ర్ టికోమిరోవ్ చేయి మాత్ర‌మే. అతను చేయి ప‌ట్టుకోగా.. ఆమె వేలాడుతూ అద్భుత‌మైన ఫొటోకు పోజిచ్చింది. నిజానికి ఈ ఫొటో గ‌తేడాది డిసెంబ‌ర్ 29న తీసింది. అప్ప‌టి నుంచి దీనికి ల‌క్ష‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. అయితే ఆ ఫొటో షూట్‌కు సంబంధించి తాను ఆ డేరింగ్ స్టంట్ ఎలా చేసిందో చూపే వీడియోను ఈ మ‌ధ్యే ఆమె పోస్ట్ చేయ‌డంతో ఈ ఫొటోపై చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది.

Full video (link in bio)! @a_mavrin #MAVRINmodels #MAVRIN #VikiOdintcova #Dubai

A post shared by Viki Odintcova (@viki_odintcova) onఅయితే ఈ ఫొటో షూట్ ఆమెకు ప్ర‌శంస‌ల కంటే విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా తెచ్చిపెట్టింది. జీవితం ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ఉండ‌టంపై ఆమెను చాలా మంది విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ ఈ తాజా వీడియో మాత్రం వైర‌ల్‌గా మారిపోయింది. ఇప్ప‌టికే 4.2 ల‌క్ష‌ల మంది చూడ‌గా.. 51 వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. గ‌తంలో బిహైండ్ ద సీన్స్ వీడియోను కూడా ఒడింక్టోవా షేర్ చేసింది. దీనికి ఇప్ప‌టికే ప‌ది ల‌క్ష‌ల‌కుపైగా వ్యూస్ రావ‌డం విశేషం.

From reality Ph: @a_mavrin #MAVRIN #MAVRINmodels #VikiOdintcova @sashatikhomirov #Dubai

A post shared by Viki Odintcova (@viki_odintcova) on


2661
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS