ర‌ష్యా చేతిలో ట్రంప్ శృంగార‌లీల‌లు

Thu,January 12, 2017 04:16 PM

Russia has sex videos featuring Donald Trump and prostitutes

న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ బాగోతం ఇప్పుడు ర‌ష్యా చేతిలో ఉంది. మాస్కో హోట‌ళ్లో ట్రంప్ సాగించిన అశ్లీల ప‌ర్వం ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. అమెరికా ఇంట‌ర్నెట్ కంపెనీ బ‌జ్‌ఫీడ్ రెండు రోజుల క్రితం ఓ సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. డోనాల్డ్ ట్రంప్ శృంగార జీవితాన్ని ర‌ష్యా ఫాలో అవుతున్న‌ట్లు ఓ రిపోర్ట్‌ను వెల్ల‌డించింది. చాన్నాళ్లుగా ట్రంప్‌కు ర‌ష్యా స‌హ‌కరిస్తున్న‌ట్లు ఆ రిపోర్ట్ ద్వారా తెలుస్తున్న‌ది. బ్రిట‌న్‌కు చెందిన ఓ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ ఈ నివేదిక‌ను త‌యారు చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు. ట్రంప్ శృంగార నైజంపై ర‌ష్యా ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు రూపొందిస్తున్న‌ట్లు బ‌జ్‌ఫీడ్ త‌న రిపోర్ట్‌లో వెల్ల‌డించింది.

ట్రంప్ ఓ శృంగార పిపాసి అని ఆ నివేదిక‌లో ఆరోపించారు. గ‌తంలో మిస్ యూనివ‌ర్స్‌ పోటీల కోసం మాస్కో వెళ్లిన ట్రంప్ అక్క‌డ రిట్జ్ కార్ల‌ట‌న్ హోట‌ల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు. అంత‌క‌ముందే అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా త‌న స‌తీమ‌ణితో క‌ల‌సి ఇదే హోట‌ల్ రూమ్‌లో బ‌స చేశారు. అయితే ఆ హోట‌ల్ రూమ్‌లో ట్రంప్ వికృత శృంగార చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డ‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఒబామా దంపతులు గ‌డిపిన బెడ్‌పైనే వ్య‌భిచారుల‌తో అస‌భ్య‌క‌ర శృంగార చేష్ట‌లు ట్రంప్ చేయించిన‌ట్లు తెలుస్తున్న‌ది. దీనికి సంబంధించి ర‌ష్యా ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయ‌ని బ‌జ్‌ఫీడ్ త‌న రిపోర్ట్‌లో పేర్కొంది. హోట‌ల్ రూమ్‌లో ప్రాస్టిట్యూట్స్‌తో గోల్డెన్‌షోవ‌ర్ చేయించిన‌ట్లు కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గోల్డెన్ షోవ‌ర్ హ్యాష్‌ట్యాగ్ బుధ‌వారం ఇంటర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నికైన ట్రంప్ బుధ‌వారం తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఆ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు స్పందించారు. ఇంటెలిజెన్స్ వ‌ర్గాలే ఆ వీడియోల‌ను రిలీజ్ చేసి ఉంటాయ‌ని ఆరోపించారు. ఇది ఇంటెలిజెన్స్ సంస్థ‌ల‌కు ఓ మ‌చ్చ అన్నారు. ర‌ష్యా ద‌గ్గ‌ర అశ్లీల వీడియోలు ఉన్నాయ‌న్న వార్త‌ను ట్రంప్ కొట్టిపారేశారు. అలా ఎప్పుడూ జ‌ర‌గ‌ద‌న్నారు.

8138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles