కోల్డ్ వెద‌ర్‌.. గ‌డ్డ‌క‌ట్టిన న‌యాగారా

Wed,January 23, 2019 03:37 PM

rushing waters at Niagara Falls have frozen due to cold weather

ఒంటారియో : ఎముక‌లు కొరికే చ‌లి. ఆ కోల్డ్ వెద‌ర్‌లో అందాల న‌యాగారా ఇలా ఆగిపోయింది. ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న ఆ జ‌ల‌పాతం ఇప్పుడు ఓ హిమ‌లోకంగా మారింది. కెన‌డా, అమెరికాలో ఇప్పుడు వింట‌ర్ వెద‌ర్ కొన‌సాగుతోంది. తీవ్ర‌మైన చ‌లి గాలులు వీస్తున్నాయి. భారీ స్థాయిలో మంచు కూడా కురుస్తోంది. అయితే జ‌ల‌జ‌ల పారే న‌య‌గారా కొన్ని ప్రాంతాల్లో గ‌డ్డ‌క‌ట్టుకుపోయింది. స్నో కుర‌వ‌డం వ‌ల్ల ఆ న‌ది ఇప్పుడు ఓ డీప్ ఫ్రీజ‌ర్‌లా మారింది. నిలిచిపోయిన నీటిని చూస్తూ ప‌ర్యాట‌కులు థ్రిల్ అవుతున్నారు. త‌మ కెమెరాల్లో ఆ అద్భుత అందాల‌ను బందిస్తున్నారు. మ‌రో వారం రోజుల పాటు కోల్డ్ వేవ్ కొన‌సాగుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు.

1799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles