రెండ‌వ రోజూ త‌న్నుకున్న ఎంపీలు - వీడియో

Fri,November 16, 2018 06:10 PM

Ruckus in Sri Lanka Parliament, MPs hurl chilli powder

కొలంబో : శ్రీలంక పార్ల‌మెంట్‌లో రెండ‌వ రోజు కూడా ఎంపీలు త‌న్నుకున్నారు. వివాదాస్ప‌ద‌ ప్ర‌ధాని రాజ‌ప‌క్సే మ‌ద్ద‌తుదారులు.. స్పీక‌ర్ జ‌య‌సూర్య సీట‌ను ఆక్ర‌మించారు. స‌భ‌లో విధులు నిర్వ‌హిస్తున్న పోలీసుల‌పైన కూడా విరుచుకుప‌డ్డారు. కారం పొడిని కూడా ఎంపీలు చ‌ల్లుకున్నారు. దేశానికి స్పీక‌ర్ లేరు.. ప్ర‌భుత్వం లేద‌ని గురువారం స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో రెండు వ‌ర్గాల‌కు చెందిన ఎంపీలు కొట్టుకున్నారు. బ‌ల‌ప‌రీక్ష‌ను త‌ప్పుప‌డుతూ ఎంపీలు బాహాబాహీకి దిగారు. గురువారం నిర్వ‌హించ‌లేక‌పోయిన బ‌ల‌ప‌రీక్ష‌ను ఇవాళ నిర్వ‌హించాల‌నుకున్నారు. కానీ రాజ‌ప‌క్సే, విక్ర‌మ‌సింఘే వ‌ర్గ ఎంపీలు త‌న్నుకోవ‌డంతో బ‌ల‌ప‌రీక్ష‌ జ‌ర‌గ‌లేదు. పార్ల‌మెంట్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ర‌ద్దు చేసేది లేద‌ని ప్రెసిడెంట్ సిరిసేన తెలిపారు.1310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles