ఐక్యరాజ్యసమితి మీటింగ్‌లో హల్ చల్ చేసిన రోబో సోఫియాFri,October 13, 2017 05:17 PM
ఐక్యరాజ్యసమితి మీటింగ్‌లో హల్ చల్ చేసిన రోబో సోఫియా

రోబో సోఫియా.. అమెరికాకు చెందిన ప్రముఖ రోబోటిసిస్ట్ డేవిడ్ హాన్సన్ ఈ రోబోను తయారు చేశాడు. అచ్చం మనిషిని పోలి ఉండే ఈ రోబోను యూఎన్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. న్యూయార్క్‌లో 'సాంకేతిక యుగంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి-భవిష్యత్తు' పై జరిగిన కాన్ఫరెన్స్ లో యూఎన్ సభ్యులతో పాటు రోబో సోఫియా కూడా పాల్గొన్నది. యూఎన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమినా జే మహమ్మద్ రోబో సోఫియాను ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేశారు.


ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా ప్రజలకు అందుబాటులో ఎలా ఉండగలమంటూ అమినా సోఫియాను ప్రశ్నించగా... విన్ విన్ టైప్ ఫలితాల మీద ఫోకస్ చేస్తే..ఫుడ్, ఎనర్జీ లాంటి రిసోర్సెస్‌ను ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్‌తో ప్రపంచం మొత్తం పంచేయొచ్చంటూ ఎంతో స్మార్ట్‌గా సోఫియా సమాధానం ఇవ్వడంతో యూఎన్‌లోని సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అవ్వడంతో పాటు చిరునవ్వు చిందించారు.1405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS