నేతల సభకు కాపలాగా రోబో పోలీసు

Wed,November 14, 2018 05:02 PM

robocop special attraction at singapur conclave

సింగపూర్‌లో జరుగుతున్న తూర్పు ఆసియా శిఖరాగ్రసభలో ఓ రోబోపోలీసు హల్‌చల్ చేసింది. హైటెక్ సింగపూర్ ప్రభుత్వం దానిని కాపలాకు నియమించారు. గుండ్రంగా 360 డిగ్రీలు తిరిగే తల, నీలిరంగు ఫ్లాష్ లైట్లతో తెల్లని ఆ రోబో చూపరులను ఆకట్టుకుంటున్నది. ఆదడుగుల ఎత్తు, నాలుగు చక్రాలతో అది సభా ప్రాంగణం చుట్టూ చక్కర్లు కొడుతూ నిఘా బాధ్యతలు నిర్వహించింది. సింగపూర్ పోలీసు విభాగం రూపొందించిన ఆ మొట్టమొదటి నమూనా రోబోకు ఇంకా పేరుపెట్టలేదు. ముందుగా నిర్దేశించిన మార్గంలో అది తనంతట తానే తిరుగుతూ అన్నిటిని గమిస్తుంది. ప్రమాదజరమైన వస్తువు లేదా మనిషి కనిపిస్తే కమాండ్ సెంటర్‌కు సమాచారం అందిస్తుంది. అది చట్టాన్ని అమలు చేసే సంస్థకు చెందిన రోబో అని తెలియకుండా చాలామంది అదేదో పెద్ద బొమ్మ అన్నట్టు కళ్లప్పగించి చూడడం గమనార్హం. ఈ నమూనా రోబో పనితీరును సమీక్షించిన తర్వాత మరిన్ని పోలీసు రోబోలను తయారు చేయాలని అనుకుంటున్నారు.

1231
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles