వీడియో: త‌ల‌పై గ‌న్‌తో గురి పెట్టినా ఏమాత్రం జంక‌లేదు!

Fri,December 8, 2017 03:55 PM

Robber points gun at cashier but cashier stares at him video goes viral

ఇది నిజంగా విచిత్రమైన ఘటనగా పేర్కొనవచ్చు. ఓ దొంగ ఏక్‌దమ్ పక్కాగా ప్లాన్ చేసి మరీ.. గన్‌తో ఫార్మసీ షాప్‌కు వెళ్లాడు. క్యాండీ, ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. క్యాషియర్ దగ్గరకు వచ్చాడు. క్యాషియర్ బిల్లు ప్రిపేర్ చేస్తుండగా.. జేబులో పెట్టుకున్న గన్‌ను తీసి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో క్యాషియర్‌పై గన్‌ను గురిపెట్టాడు. సాధారణంగా ఎవరైనా గన్ గురిపెడితే ఏం చేయాలి.. భయపడిపోవాలి... వెంటనే అతడి వద్ద ఉన్న క్యాష్‌ను ఇచ్చేయాలి. లేకపోతే.. గన్‌తో దొంగ కాల్చేస్తాడు కదా.

కాని.. ఆ క్యాషియర్ మాత్రం ఉలకలేదు.. పలకలేదు.. అలాగే ఆ దొంగ వైపు విచిత్రంగా చూశాడు. అలాగే తదేకంగా దొంగవైపు ఆ క్యాషియర్ చూసేసరికి.. దొంగ ఏమనుకున్నాడో ఏమో... కేవలం 6 డాలర్ల విలువ చేసే క్యాండీ, ఐస్ క్రీమ్ ఉన్న కవర్‌ను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన యూఎస్‌లోని ఫ్లొరిడాలో జరిగింది. ఆ షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డవడంతో నిందితుడిని పట్టుకోవడం కోసం పోలీసులు ఆ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. అంతే కాదు.. ఆ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తూ ఆ క్యాషియర్ దైర్యాన్ని తెగ మెచ్చకుంటున్నారు.

అయితే.. అసలు ఓ దొంగ గన్ గురి పెట్ట కాల్చేస్తా అని బెదిరించినా.. బెదరకుండా అలాగే ఎలా ఉన్నావయ్యా అని ఆ క్యాషియర్‌ను పోలీసులు అడిగారట. దానికి ఆ క్యాషియర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఏ.. ఆ దొంగకు అంత సీన్ లేదు సార్.. అందుకే ఆ దొంగను చూసి భయపడలేదు అని సెలవిచ్చాడట. అయినప్పటికీ.. ఎవరైనా గన్ గురి పెట్టి డబ్బు ఇవ్వాలని బెదిరిస్తే.. వెంటనే మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేయాలి.. కాని ప్రాణాన్ని రిస్క్ లో పెట్టుకోకూడదు. ఒకవేళ ఆ దొంగకు చిర్రెత్తుకొచ్చి కాల్చితే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడూ అటువంటి రిస్క్ చేయొద్దంటూ మన క్యాషియర్‌కు ఓ రౌండ్ క్లాస్ పీకి.. ఇక ఆ దొంగను పట్టుకునే పనిలో పడ్డారట పోలీసులు.

5057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles